ఆలిండియా టాపర్లుగా తెలుగోళ్లు
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): సీఏ (చార్టెడ్ అకౌంట్స్) తుది ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. హైదరాబాద్ విద్యార్థి హేరంబ్ మహేశ్వరి ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. సీఏ ఫైనల్ పరీక్షల ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) శుక్రవారం విడుదల చేసింది.
ఇందులో హేరంబ్‌తోపాటు తిరుపతికి చెందిన రిషబ్ ఓస్వాల్ ఆర్ 84.67 శాతం స్కోర్‌తో ఆలిండియా టాపర్లుగా నిలిచారు. అహ్మదాబాద్ విద్యార్థి రియా కుంజాకుమారి రెండో ర్యాంక్, కోల్‌కత్తాకు చెందిన కింజల్ అజ్మీరా మూడో ర్యాంకు సాంధించారు. ఈ ఏడాది సీఏ గ్రూప్-1కు మొత్తం 66,987 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11,253 (16.8 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.