భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో హైదరాబాద్ తుఫాన్స్ ఉత్కంఠ వి జయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 5-4తో ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో గెలుపు సాధించింది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. హైదరాబాద్ తరఫున అమన్‌దీప్ (11వ నిమిషం), గొంజాలో (13వ ని.లో) గోల్స్ సాధించగా.. ఢిల్లీ తరఫున దిల్‌రాజ్ సింగ్ (21వ ని.లో), గారెత్ (50వ ని.లో) గోల్స్ అందించారు.