calender_icon.png 23 October, 2024 | 3:16 AM

హైదరాబాద్ 6 లేన్ల రోడ్డు

17-09-2024 05:23:12 AM

  1. రూ.2 వేల కోట్లతో పనులు 
  2. పేదల ఇండ్ల నిర్మాణానికి 50 ఎకరాలు 
  3. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  

నల్లగొండ, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని త్వరలో ఆరులేన్లగా విస్తరించనున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే రూ.2 వేల కోట్లతో విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో శంకుస్థాపన చేయించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్‌లో వినాయక మండపంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి సోమవా రం మంత్రి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి రోల్ మోడల్‌గా నల్లగొండ మున్సిపాలిటీని తీర్చిదిద్దనున్నట్లు స్పష్టం చేశారు.

రూ.450 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులు పూర్తికావస్తున్నాయని వెల్లడించారు. రానున్న రెండేళ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతోపాటు సీసీరోడ్లను పూర్తి చేస్తామన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డుకు చెందిన 50 ఎకరాల స్థలాన్ని సేకరించామని చెప్పారు. 25 ఎకరాల్లో పేద విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. తాగునీటికి కొరత లేకుండా 10 లక్షల సామర్థ్యం కలిగిన 10 ఓవర్ హెడ్ ట్యాంకులు, 15 లక్షల సామర్థ్యం కలిగిన 5 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మతసామరస్యానికి ప్రతీక నల్లగొండ అని గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.