calender_icon.png 20 October, 2024 | 1:30 PM

నిర్మాణ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలవాలి

20-10-2024 01:30:52 AM

మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): నిర్మాణ రంగంలో హైదరాబాద్ దేశంలోని అన్ని నగరాలతో పోటీ పడి అగ్రగామిగా నిలవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావుతో కలిసి శనివారం కొంపల్లిలోని ఆస్పేసియస్ కన్వెన్షన్ సెంటర్‌లో రూఫ్ అండ్ ఫ్లోర్ ప్రాపర్టీ ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం బిల్డర్లు, రియల్ డెవలపర్లతో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. హైడ్రా విషయంలో రెచ్చగొట్టేవారి మాటలు విని ఆందోళన చెందవద్దని నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సూచించారు. ఉత్తర హైదరాబాద్ ఇంకా విస్తరించి నివాస సముదాయాలు, విల్లాలతో శోభిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రదర్శనలో 15 మంది డెవలపర్లు సుమారు 100 ప్రాజెక్టులను ప్రద ర్శించారు. ఇళ్ల కొనుగోలుదారులకు విస్తృత శ్రేణి నివాస ప్రాపర్టీలను అన్వేషించడానికి, నిపుణుల సలహా పొందడానికి, ప్రముఖ డెవలపర్లతో మాట్లాడే అవకాశాన్ని ఈ ప్రదర్శన అందించింది. ఈ ప్రదర్శనలో అపర్ణా కన్‌స్ట్రక్షన్స్, ప్రైమార్క్, సాకేత్ డెవలపర్స్, సుబిషి ఇన్‌ఫ్రా, శిల్పా ఇన్‌ఫ్రాటెక్, మోడీ బిల్డర్స్, శాంతా శ్రీరామ్, గోల్డెన్‌కీ, గ్రోత్ స్టోరీస్, లెక్సస్ గ్రూప్, ఎస్‌క్యూబ్ తదితర సంస్థలు పాల్గొన్నాయి.  ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగనున్నది.