calender_icon.png 28 December, 2024 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు గ్రేటర్‌లో ‘హైదరాబాద్ రైజింగ్’

03-12-2024 12:58:22 AM

6,691 కోట్ల మేర అభివృద్ధ్ది పనులకు సీఎం శంకుస్థాపన

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలనా ఉత్సవాల్లో భాగంగా గ్రేటర్ పరిధిలో ‘హైదరాబాద్ రైజింగ్’ పేరుతో మంగళవారం చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు రూ. 6,691 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధ్ది కార్యక్రమాలను సీఎం చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

రాజ్‌భవన్ రోడ్డులోని లేక్ వ్వ్యూ గెస్ట్‌హౌస్ వద్ద నిర్మిస్తున్న రెయిన్ వాటర్ హోల్డింగ్స్ ( వరదనీటి సంపులు)ను హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఇతర అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో ఉన్న 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ప్రాంతాల్లో రెయిన్ వాటర్ హోల్డింగ్స్ నిర్మాణించాలని, వచ్చే వర్షాకాలం నాటికి పనులన్నీ పూర్తికావాలని సూచించారు. రెయిన్ వాటర్ సంపుల డిజైన్‌ను మార్చాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం సూచించారు.

కాగా హెచ్‌సిటీ ప్రోగ్రాంలో కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ట్రాఫిక్ నివారణకు రూ. 5,942 కోట్లతో నిర్మాణం చేయనున్న ఫ్లుఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలకు, ఎస్‌ఎన్‌డీపీ కింద రూ.586 కోట్లతో, రహదారులపై రూ. 17 కోట్ల వ్యయంతో నిర్మాణం చేస్తున్న 12 రెయిన్ వాటర్ హోల్టింగ్ స్ట్రక్చర్స్‌ను సీఎం శంకుస్థాపన చేయనున్నారు.