calender_icon.png 14 October, 2024 | 6:46 PM

హైదరాబాద్లో వర్షం.. జిల్లాలకు ఎల్లో అలర్ట్

14-10-2024 04:48:47 PM

హైదరాబాద్: రాష్ట్రంలో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, అమీర్ పేట్, ఎర్రగడ్డ, గచ్చిబౌలి, టోలిచౌకి, కూకట్ పల్లి, హైదర్ నగర్,ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, కేపీహెచ్ బీ కాలనీ, ప్రగతినగర్, బహదూర్ పల్లి, సూరారం, గుండ్ల పోచంపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బాలానగర్, ఖైరతాబాద్, మేడ్చల్, కృష్ణాపూర్, గండిమైసమ్మ, మల్లంపేట్, దుండిగల్, బాచుపల్లిలో వాన పడుతోంది.

వర్షం ధాటికి ఎక్కడి వాహనదారులు అక్కడ నిలిచిపోయారు. అటు జిల్లాల్లోనూ వర్షం జోరందుకుంది. సంగారెడ్డి, పటాన్ చెరు, వికారాబాద్ జిల్లా, తాండూరు వర్షం కురుస్తోంది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ములుగు జిల్లాలకు వర్ష సూచన ఉండగా... రేపు ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాల్లో వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.