calender_icon.png 31 October, 2024 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ప్రతిష్ఠ పడిపోతోంది: కే.పీ. వివేకానంద గౌడ్

15-07-2024 12:38:07 PM

హైదరాబాద్: పాలన బాగుందని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద గౌడ్ ఆరోపించారు. క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను తెలుసుకోవాలని కోరారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా  కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ.... శాఖలవారీగా సమీక్షలు జరిపి వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. హైదరాబాద్ ప్రతిష్ఠ రోజురోజుకూ పడిపోతోందని, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేస్తారు. జిల్లా కేంద్రాలతో పాటు గ్రామాల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు. జిల్లా కేంద్రంలో కొనుగోళ్లు, అమ్మకాలు జరగట్లేదన్నారు. స్థిరాస్తి రంగం పడిపోయి వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.