19-03-2025 11:50:19 PM
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీసులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. చౌమహల్లా పాలేస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు, రాజకీయ నాయకులు, ముస్లిం కుటుంబాలకు చెందిన సుమారు 1500 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, డిజిపి జితేందర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్‌లు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. సామరస్యం, సద్భావనను సాకారం చేసేందుకు కృషి చేద్దాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మీర్ జుల్ఫేకర్ అలీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, లా అండ్ ఆర్టర్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, సీనియర్ పోలీసు అధికారులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.