calender_icon.png 11 February, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యాత్రికులు మృతి

11-02-2025 01:04:16 PM

జబల్‌పూర్,(విజయక్రాంతి): ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తు ఓ మినీ బస్సను లారీ ఢికొట్టిని ఘటన మధ్యప్రదేశ్‌లోని సిహోరా సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... జబల్‌పూర్ జిల్లాలోని సిహోరా సమీపంలో ఇవాళ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ హైవే పైకి రాంగ్ రూట్ లో వచ్చింది. అప్పుడే ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా నుండి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ఒక మినీ బస్సు ఎదురుగా రావడంతో లారీ ఒకసారిగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు మినీ బస్సులో చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనం నంబర్ AP29W1525 గా గుర్తించిన పోలీసులు మినీ బస్సు రిజిస్టేషన్ ఆధారంగా మృతులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా తొలుత భావించారు. కానీ మృతదేహాల దగ్గర ఉన్న ఆధారాలతో హైదరాబాద్ లోని నాచారం వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన జబల్‌పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా ట్రక్కు రాంగ్ రూట్లో హైవేపై వెళడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.