24-03-2025 12:55:52 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీకాలం 2025 మే 1న ముగియనున్నందున, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ద్వైవార్షిక ఎన్నికను నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. మార్చి 28న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు నామినేషన్ దశ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 7న నామినేషన్లను పరిశీలన, ఏప్రిల్ 9వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు ప్రక్రియ ఉండనుంది. ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించి, 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ చేయనున్నాయి. ఈ ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.