calender_icon.png 20 November, 2024 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు ‘ఐజీబీసీ’ సర్టిఫికేషన్

20-11-2024 03:20:33 AM

ఈ తరహా సర్టిఫికేషన్ పొందిన మొదటి సంస్థగా రికార్డు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని 57 మెట్రో స్టేషన్లకు ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) గ్రీన్ ఎగ్జిస్టింగ్ ఎంఆర్‌టీఎస్ ప్లాటినం సర్టిఫికేషన్ వచ్చినట్లు ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ అధికారులు వెల్లడించారు. రెడ్‌లైన్, బ్లూలైన్, గ్రీన్‌లైన్ కారిడార్లలో ఉన్న అన్ని స్టేషన్లకు ఈ తరహా సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే మొదటిసంస్థగా పేర్కొన్నారు.

ఇటీవల ఐజీబీసీ ఆధ్వర్యం లో బెంగుళూరులో జరిగిన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ఆ సంస్థ చైర్మన్ బి.త్యాగరాజన్, సీఈవో క్రిస్టోఫర్ డిలా క్రూజ్, సీఐఐ, ఐజీబీసీ జాతీయ ఉపాధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి చేతుల మీదుగా ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ సీఈవో కేవీబీ రెడ్డి, ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్ చిప్లుంకర్ ఈ అవార్డును అందుకున్నారు. కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిష్ఠాత్మక అవార్డు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.  ఇది విద్యుత్ పొదుపు, పర్యావరణ అనుకూలతను ధ్రువీకరిస్తుందని తెలిపారు.