హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నిన్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తమ ఓటు హక్కును వినయోగించుకోవడానికి హైదరాబాద్ నివాసముంటున్న ప్రజలు స్వగ్రామాలకు వెళ్లారు. నేడు మళ్లీ తిరిగి హైదరాబాద్ కు పయనం అయ్యారు. దీంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు జనసంద్రంగా మారాయి. మరోపక్క హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఎల్ బీనగర్ నుంచి మియాపూర్ వైపు మెట్రోలో రద్దీ పెరిగింది. ఎన్నికలకు సొంతూళ్లకు వెళ్లినావారు తిరిగిరావడంతో మెట్రోలో రద్దీ పెరిగింది. మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచే రైట్రో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. రద్దీ దృష్ట్యా అరగంట ముందే మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎక్కువ ట్రిప్పులు నడపాలని మెట్రో యోచిస్తోంది. చాలా మంది ప్రజలు సోంతూళ్లకు వెళ్లడంతో సోమవారం నాడు హైదరాబాద్ నగరం ఖాళీగా కనిపించింది.