calender_icon.png 22 November, 2024 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ అంటేనే గొలుసు కట్టు చెరువులు

22-11-2024 01:52:48 PM

హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): హైదరాబాద్ అంటేనే ఒక చెరువుకు మరొక చెరువుకు కనెక్టివిటీ ఉండి గొలుసు కట్టు చెరువులుగా పేరుగాంచిన నగరం అని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బేగంపేట లోని సెస్ కార్యాలయంలో తెలంగాణ వెదర్ క్లైమేట్ సర్వీసెస్ శుక్రవారం వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హైడ్రా కమీషనర్ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ.. అర్బన్ డిజాస్టర్స్, ఎంక్రోచ్ ల కోసం హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. హైడ్రా జిహెచ్ఎంసీలో భాగం కాదన్నారు. హైడ్రాకు మొదటి కమిషనర్ గా ఉండటం సంతోషంగా ఉందన్నారు. జీహెచ్ఎంసీలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరో 27 మునిసిపాలిటీల పరిధిలో హైడ్రా పనిచేస్తుందన్నారు.

ఆక్రమణలకు గురవుతున్న వాటర్ బాడీస్, గవర్నమెంట్ ల్యాండ్స్, పబ్లిక్ అసెట్స్, లేక్స్ పరిరక్షణకు హైడ్రా పని చేస్తుందన్నారు. హైదరాబాద్ అంటేనే గొలుసు కట్టు చెరువులు. ఒక చెరువుకు మరో చెరువుకు కనెక్టివిటీ ఉండేది. ఇప్పుడు కనెక్టివిటీ లేకుండా పోయిందన్నారు. నాలాలు సరిగా లేనందున గట్టి వర్షం పడితే ముంపుకు గురవుతున్నామని అన్నారు. దివి సీమ ఉప్పెన వచ్చినప్పుడు 10 వేల మంది చనిపోయారనీ తెలిపారు. ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఐఎండీ వల్ల ముందే ఊహించగలుగుతున్నారు. డిజాస్టర్ట్స్ లో కూడా మార్పులు వస్తున్నాయి. కంట్రీలో అర్బనైజేషన్ పెరుగుతుందన్నారు. తెలంగాణలో అర్బనైజేషన్ పెరుగుతుంది. వెహికిల్ పాపులేషన్ 80 లక్షలుగా ఉందన్నారు. సిటీలో 2, 3 సెంటిమీటర్ల వర్షం పడితే మూడు, నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుందన్నారు. హైడ్రా, ఐఎండీతో కలిసి పనిచేస్తుందన్నారు.