23-04-2025 10:37:40 AM
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్(Hyderabad Local Bodies MLC Election Polling) జరగనుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం పోటీ పడుతున్నాయి. బీజేపీ(Bharatiya Janata Party) నుంచి గౌతమ్ రావు, ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ బరిలో ఉన్నారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 112 ఓట్లు ఉన్నాయి. 81 మంది కార్పొరేటర్లు, 31 ఎక్స్ అఫీషియా సభ్యులు ఓటు హక్కు వినియోగింకోనున్నారు. బిల్దియా కార్యాలయం వద్ద 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీ విప్ జారీ చేసింది. ఎమ్మెల్సీ పోలింగ్ కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ విప్ జారీచేసింది.