హైదరాబాద్ : మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్డులోని శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో డిసెంబర్ 28న మెగా జాబ్ మేళా(Job Mela) నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో అనేక కంపెనీలు పాల్గొంటాయని, ఫార్మా, హెల్త్, ఐటీ, ఐటీ సంస్థలు, విద్య, బ్యాంకులు తదితర విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాయని నిర్వాహకులు మన్నన్ ఖాన్ ఇంజనీర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌లను కూడా కొన్ని కంపెనీలు అందిస్తాయి. అభ్యర్థుల అర్హత SSC పైన ఉండాలి. ప్రాథమిక ఇంటర్వ్యూలు వేదిక వద్ద నిర్వహించబడతాయని తెలిపారు. ఉచిత ప్రవేశం ఉన్న ఈ జాబ్ మేళాకు ఆసక్తి ఉన్నవారు 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.