calender_icon.png 26 April, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌దే విజయం

26-04-2025 01:05:14 AM

5 వికెట్ల తేడాతో చెన్నై ఓటమి

చెన్నై, ఏప్రిల్ 25: ఐపీఎల్ 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని అందుకుంది. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత చెన్నై సూపర్ కింగ్స్ 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్ (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హర్షల్ పటేల్ 4 వికెట్లతో చెలరేగగా.. కమిన్స్, ఉనాద్కట్ చెరో 2 వికెట్లు తీశాడు.

అనం తరం ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబా ద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలుపొందింది. ఇషాన్ కిషన్ (44) రాణించగా.. ఆఖ ర్లో కమిందు మెండిస్ (32 నాటౌట్), నితీశ్ కుమార్ (19 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.

చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయ గా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్, జడేజా తలా ఒక వికెట్ తీశారు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు 9 మ్యాచ్‌ల్లో మూడో విజయం కాగా.. చెపాక్ స్టేడియంలో ఇదే తొలి గెలుపు కావడం విశేషం. నేడు జరగనున్న మ్యాచ్‌లో కోల్‌కతాతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.