- ఫోర్బ్స్-2000 కంపెనీలను ఆకర్షిస్తున్న నగరం
- ప్రస్తుతం మనవద్ద 110, బెంగళూరులో 282 కేంద్రాలు
- తెలంగాణలో 190కి చేరుకునే అవకాశం
- ‘ఏఎన్‌ఎస్‌ఆర్’ సంస్థ వెల్లడి
హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాం తి): గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ల (జీసీసీ)కు తెలంగాణ గమ్యస్థానంగా మారబోతోంది. ఇప్పటికే అమెజాన్, ఆపిల్ వంటి దిగ్గజ సం స్థలు తమ జీసీసీలను ఏర్పాటు చేసి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల జీసీసీల రాక మరింత పెరగనున్నట్టు దేశీయ కన్సల్టెన్సీ సంస్థ ఏఎన్‌ఎస్‌ఆర్ తెలిపింది.
ఫోర్బ్స్-2000 జాబితాలోని కంపెనీల జీసీసీలను ఆకర్షించడంతో భారత్ ముందు వరుసలో ఉంటుందని అంచనా వేసింది. 2030 నాటికి ఫోర్బ్స్ జాబితాలోని కంపెనీల్లో 650కి పైగా అంటే 42 శాతం జీసీసీలు భారత్‌లోనే ఏర్పాటు కాబోతున్న ట్టు స్పష్టంచేసింది. వాటిలో ప్రపంచ ప్రఖ్యా త కంపెనీల జీసీసీలను ఆకర్షించడంలో బెంగళూరు, హైదరాబాద్ ముందు వరుసలో ఉంటాయని పేర్కొంది.
2024 వరకు దేశంలో మొత్తం 825 జీసీసీలు ఉంటే.. అందులో ఫోర్బ్స్ కంపెనీల జీసీసీలు 450 ఉన్నాయి. వాటిలో హైదరాబా ద్‌లో 110 ఉంటే, బెంగళూరులో 282 జీసీసీలు ఉన్నాయి. 2030 నాటికి దేశంలో జీసీసీ సంఖ్య 620 లేదా అంతకంటే ఎక్కువగా చేరుకునే అవకాశం ఉందని ఏఎన్‌ఎ స్‌ఆర్ పేర్కొంది.
తెలంగాణలో పెరగనున్న ఆఫీస్ స్పేస్
జీసీసీలకు ఇప్పటికే హైదరాబాద్ అడ్డగా మారింది. ఇప్పుడు తెలంగాణలో దాదాపు 150కి పైగా జీసీసీలు ఉన్నాయి. వాటిలో 110 కంపెనీలు ఫోర్బ్స్ జాబితాలోనివే కావడం గమనార్హం. ఇప్పుడున్న జీసీసీలన్నీ హైదరాబాద్ కేంద్రంగానే నడుస్తున్నాయి. అయితే, వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో ఆఫీస్ స్పెస్ భారీగా పెరగనుంది. దీంతో జీసీసీ ఏర్పాటులో కూడా భారీగా వృద్ధిరేటు నమోదవుతున్నాయన్న అంచనాలు ఉన్నాయి.
ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ వంటి జిల్లా కేంద్రాలకు కూడా జీసీసీలకు కేంద్రాలుగా మారే అవకాశం ఉందని ఇప్పటికే పలు కన్సెల్టెన్సీలు చెప్పాయి. 2030 తెలంగాణలో జీసీసీలు 500కు పెరుగుతాయని ఇప్పటికే నాస్కామ్ వెల్లడించింది. ఈ క్రమంలో ఏఎన్‌ఎస్‌ఆర్‌తో ఇతర ఇతర కన్సల్టెన్సీల అంచనాలను పోల్చినప్పుడు తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో ఫోర్బ్స్-2000 జాబితాలోని కంపెనీలు మరో 80 నుంచి 90 వరకు సంస్థలు తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అంటే ఫోర్బ్స్ కంపెనీల జీసీసీలు 190 నుంచి 200 వరకు పెరగొచ్చని అంచనా. జీసీసీల ఏర్పాటుతో ఉపాధి కూడా భారీగా పెరగనున్నట్టు ఏఎన్‌ఎస్‌ఆర్ ఏజెన్సీ పేర్కొంది. 2024 నాటికి దేశంలో జీసీసీలు 13 లక్షల మంది నిపుణులను నియమించుకున్నాయి. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో జీసీసీలు భారీగా రాబోతున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు కూడా అదే స్థాయిలో వృద్ధి చెందుతాయని ఏఎన్‌ఎస్‌ఆర్ సంస్థ పేర్కొంది.
ఆసక్తి చూపిస్తున్న కంపెనీలు ఇవే
2024 నాటికి దేశంలో 450 పైగా ఫోర్బ్స్ కంపెనీల జీసీసీలు ఉంటే అందు లో అందులో 60 శాతం సంస్థలు ఉత్తర అమెరికా మూలానికి చెందివే ఉండటం గమనార్హం. 125కి పైగా కంపెనీలు యూ రప్‌కు చెందినవి. భారత్‌లో జీసీసీలో బీఎఫ్‌ఎస్‌ఐ రంగం ఆధిపత్యాన్ని చెలాయి స్తోంది. ఆ తర్వాత ఫైనాన్స్, మానవ వనరుల నిర్వహణ, సెబర్ సెక్యూరిటీ, క్లౌడ్ వంటి సెక్టార్‌లో జీసీసీలు ఉన్నట్టు ఏఎన్‌ఎస్‌ఆర్ సంస్థ చెప్పింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జీసీసీలు సాంకేతిక ఆవిష్కరణలతో నైపుణ్యం కలిగిన మానవ వనరు ల కోసం అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ, డాటా ఎనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలకు జీసీసీలు అధిక ప్రాధా న్యం ఇస్తున్నాయి. ప్రపంచ సాంకేతిక గమనాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఏఐ, సెబర్ సెక్యూరిటీపై తీవ్రంగా పనిచేస్తోంది. ఇప్పటికే ఏఐ సిటీకి రూపకల్పన చేస్తోంది. మరోవైపు సాంకేతిక మానవ వనరుల కోసం స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసింది.