calender_icon.png 1 March, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కీలకం

01-03-2025 12:54:11 AM

  1. ఒకప్పుడు నేనూ సైన్స్ అధ్యాపకుడినే..
  2. యువత శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి..
  3. కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి..
  4. విద్యార్థులకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాం తి): భారత రక్షణ రంగంలో హైదరాబాద్ కీల క పాత్ర పోషిస్తున్నదని రక్షణశాఖ మంత్రి రా జ్‌నాథ్‌సింగ్ కొనియాడారు. జాతీయ సైన్స్ ది నోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో డీఆర్డీవో, ఏరో నాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్‌లెన్స్ సంయుక్తంగా నిర్వహించిన ‘విజ్ఞాన్ వైభవ్’ ప్రదర్శ నను సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడు తూ.. కేంద్ర రక్షణశాఖ మంత్రి గా దేశానికి సేవలందించడం తనకెంతో ఆనందాన్నిస్తుందన్నా రు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్  ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదన్నా రు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్‌లో ముందుకు అడుగు లు వేయాల్సి ఉందన్నారు.

నోబెల్ గ్రహీత సర్ సీవీ రామన్ ఫిబ్రవరి 28న ‘రామన్ ఎఫెక్ట్’ను కనుగొన్నారని, ఆయన గౌరవార్థం ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని గుర్తుచేశారు. వ్యవసాయంతో పా టు అన్ని రంగాల్లోనూ సైన్స్ ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. సైన్స్‌తో ఒనగూరే ప్రయోజనాలను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు.

మానవ పరిణామ క్రమంతో పాటు సైన్స్ అభివృద్ధిపై అధ్యయనం చేయాలని సూచించారు. దేశ ప్రగతిలో విద్యార్థులదే కీలకపాత్ర అని, అందుకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, రక్షణ రంగంలోనూ అనేక మార్పులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు.

తాను కూడా సైన్స్ విద్యార్థినే అని, యవ్వనంలో సైన్స్ అధ్యాపకుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించానని గుర్తుచేసుకున్నారు. యువత శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకొని దేశానికి సేవలు అందించాలన్నారు. యూపీఐ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని, ఇప్పటివరకు యూపీఐ ద్వారా ఏకంగా 171 బిలియన్ల లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.2.45 లక్షల కోట్లు అన్నారు. 

దేశ రక్షణలో హైదరాబాద్, బెంగళూరు నగరాలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశానికి సాతంత్య్రానికి రావడానికి ముందు నుంచే హైదరాబాద్‌లో బీడీఎల్, హెచ్‌ఏఎల్, మిథాని, డీఆర్డీవో వంటి అనేక సంస్థలు కీలకంగా పనిచేశాయని, దేశ రక్షణ రంగంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలది ముఖ్య పాత్ర అని కొనియాడారు. అందుకే ఈ రెండు నగరాలను డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రకటించాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.

తద్వారా నగరానికి రాకెట్ తయారీ సహా ‘స్కై రూట్’ వంటి స్ట్రారప్‌లు వస్తాయన్నారు. నేటి విద్యార్థులపై దేశాన్ని రక్షించుకోవా ల్సిన బాధ్యత ఉందని, ప్రతిఒక్కరూ ఈ ప్రదర్శనను తిలకించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ లో చదివిన విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళుతున్నారని, అలాంటిఉద్దేశం ఉన్నవారిలో దేశభక్తి నింపేందుకు ప్రద ర్శన ఎంతో ఉపకరిస్తుందన్నారు.