calender_icon.png 23 November, 2024 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ అంటేనే గొలుసుకట్టు చెరువులు

23-11-2024 02:08:36 AM


ఐఎండీ 150వ వార్షికోత్సవంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్

నాలాలు, చెరువులు ఆక్రమణలతో ట్రాఫిక్ సమస్య

ప్రజలు వెదర్ రిపోర్ట్‌ను సీరియస్‌గా తీసుకోవాలి

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ అంటేనే గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి అని.. పూర్వం ఒక చెరువుతో మరో చెరువు కనెక్టివిటీ కలిగి ఉండేదని.. అలాంటిది చెరువులకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కనెక్టివిటీ లేకుండా కనుమరుగు చేశారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్‌మెం ట్ (ఐఎండీ) 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బేగంపేటలోని సెస్ కార్యాలయంలో ఐఎండీ ఆధ్వర్యంలో ‘వెదర్ అండ్ క్లుమైట్ సర్వీస్ ఆఫ్ తెలంగాణ’ అనే అంశంపై శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహించా రు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. నగరరంలోని..  వాటర్ బాడీస్, ప్రభుత్వ స్థలాలు, చెరువులకు సంబంధించి మెజార్టీ స్థలాలు ఆక్రమణలకు గురవ్వడంతో చెరువుల మధ్య కనెక్టివిటీ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  హైదరాబాద్ సహా మెట్రో నగరాల్లో వ్యక్తిగ వాహనాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని.. ఈ పరిస్థితుల్లో క్లుమైట్ చేంజెస్ అధికంగా ఉండి క్లౌడ్ బరస్ట్స్ పెరుగుతున్నాయని అన్నారు.  

వెదర్ స్టేషన్స్ సంఖ్య పెంచాలి..

హైదరాబాద్ నగరంలో 2, 3 సెంటీ మీటర్ల వర్షపాతానికే 3 గంటల సేపు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు భూమిలో ఇంకడానికి చాలా సమయం పడుతోందన్నారు. సిటీలో 157 వరకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్స్ (ఏడబ్ల్యూఎస్) ఉన్నప్పటికీ వీటి సంఖ్య ఇంకా పెంచాల్సి ఉందన్నారు. బెంగళూరు తరహాలో.. హైదరాబాద్‌లో కూడా ప్రతి నిమిషానికి ఆటోమెటిక్ వెదర్ (ఏడబ్ల్యూఎస్) స్టేషన్ల నుంచి డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని.. ఫలానా ప్లేస్‌లో వర్షం పడుతుంది అని మాత్రమే కాకుండా.. ఫలానా ప్లేస్‌లో వర్షం పడదు అని చెపే విధానానికి మారాల్సిన అవసరం ఉందని రంగనాథ్ తెలిపారు.

ప్రజలు వెదర్ రిపోర్ట్‌ను సీరియస్‌గా తీసుకునేలా హైడ్రా పనిచేస్తుందన్నారు. అర్బన్ డిజిస్టార్ మీద ఫోకస్ చేయాలన్నారు. హైడ్రా జీహెచ్‌ఎంసీలో భాగం కాదన్నారు. నగరంలోని విపత్తు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై మాత్రమే హైడ్రా పనిచేస్తుందన్నారు. హైడ్రాకు మొదటి కమిషనర్‌గా ఉండటం సంతోషంగా ఉందన్నారు.  ఈ సందర్భంగా ఐఎండీ రూపొందించిన బ్రోచర్‌ను అతిథులతో కలిసి రంగనాథ్ ఆవిష్కరించారు.  కార్యక్రమంలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.మహాపాత్ర, చెన్నై ఐఎండీ డీడీజీఎం డాక్టర్ ఎస్. బాలచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.