రంజీ ట్రోఫీ
హైదరాబాద్: రంజీ ట్రోఫీలో మూడో రౌండ్ మ్యాచ్‌లు మంగళవారంతో ముగిశాయి. ఎలైట్ గ్రూప్-బిలో ఉన్న హైదరా బాద్ ఇన్నింగ్స్ 50 పరుగుల తేడాతో పాండిచ్చేరిని మట్టికరిపించి సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో పాండిచ్చేరి 333 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 538 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే.
ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (173) మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో చండీఘర్ 10 వికెట్ల తేడాతో జార్ఖండ్‌పై, కర్ణాటక 6 వికెట్ల తేడాతో బీహార్‌పై, ఢిల్లీ 10 వికెట్ల తేడాతో అస్సాంపై, మహారాష్ట్ర 10 వికెట్ల తేడాతో మేఘాలయపై, విదర్భ 266 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై, ఆంధ్రపై హిమాచల్ ప్రదేశ్ విజయం సాధించాయి. ముంబై - త్రిపుర, కేరళ-బెంగాల్, రాజస్థాన్-గుజరాత్, తమిళనాడు-చత్తీస్‌గఢ్, పంజాబ్- యూపీ, ఎంపీ--హర్యానా మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.