- అక్టోబర్‌లో రూ.3,617 కోట్ల విలువైన విక్రయాలు
- నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ రిపోర్ట్
న్యూఢిల్లీ, నవంబర్ 22: హైదరాబాద్‌లో ఇండ్ల విక్రయాలు ఈ అక్టోబర్ నెలలో నిరు డు ఇదేనెలకంటే 14 శాతం పెరిగాయి. 2024 అక్టోబర్‌లో రూ.3,617 కోట్ల విలువైన రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాలు జరిగినట్టు రియల్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ప్రత్యేకించి రూ.1 కోటి పైబడిన పెద్ద, ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరగడంతో అమ్మకాల్లో వృద్ధి సాధ్యపడిందని నైట్‌ఫ్రాంక్ తెలిపింది.
5,985 రిజిస్ట్రేషన్లు
అక్టోబర్‌లో 5,985 రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని, నిరుడు ఇదేనెలతో పోలిస్తే 2 శాతం, ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 20 శాతం రెసిడెన్షియల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని రియల్టీ కన్సల్టెన్సీ తెలిపింది. రూ.1కోటి విలువకంటే ఎక్కువగా ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు గత ఏడాది అక్టోబర్‌కంటే 36 శాతం పెరిగాయన్నది.
70 శాతం రిజిస్ట్రేషన్లు 1000-2000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడుకున్నవని, 2000 చదరపు అడుగులకు పైబడిన ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు 14 శాతం పెరిగినట్లు వివరించింది.