calender_icon.png 19 April, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ‘హైదరాబాద్ హెరిటేజ్ వాక్’

19-04-2025 12:03:49 AM

హాజరైన డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ మణికొండ వేదకుమార్

ముషీరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి) : ప్రపంచ వారసత్వ దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఫర్ మోనుమెంట్స్ అండ్ సైట్స్) సందర్భంగా శుక్రవారం డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో, పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) హైదరాబాద్ సర్కిల్, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్ టీడీసీ), జేబీఆర్ ఏసీ, ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్, ఇతర పౌర సంఘాల భాగస్వామ్యంతో హెరిటేజ్ వాక్ డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఛైర్మన్ మనికొండ వేదకుమార్ అధ్యక్షతన చార్మినార్ వద్ద ప్రారంభిం చారు.

ప్రొఫెసర్ జి.ఎస్.వి.సూర్యనారాయణ మూర్తి, సౌత్ జోన్ రిప్రెసెంటేటివ్, ఐకామోస్ ఇండియా, డా. జి.జయశ్రీ, ప్రాచీన భారత చరిత్ర, పురావస్తు శాఖ, ఉస్మానియా యూనివర్సిటీ, కోటయ్య వింజమూరి, డిప్యూటీ సూపరింటెండెంట్ కెమిస్ట్, ఏఎస్‌ఐ డా.ఈ. సాయికృష్ణ, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్, ఏఎస్‌ఐ, జె.రాజేశ్వరి, కన్సర్వేషనిస్ట్, ఏఎస్‌ఐ, సాయి రామ్, సుధాకర్, కార్యనిర్వాహకులు, తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎస్.ప్రభాకర్, డీటీఓ, పర్యాటక శాఖ, డి.శ్రీనివాస్, హెరిటేజ్ వాక్ ఇన్చార్జ్, డి.శ్యాం సుందర్ రావు, స్థపతి, డా.ద్యావనపల్లి సత్యనారాయణ, క్యురేటర్, తెలంగాణ గిరిజన మ్యూజియం, పి.వీరమల్లు, అధ్యక్షుడు, బౌద్ధ తత్వ ఫౌండేషన్, సిటీ కాలేజ్, జేబిఏఆర్ సీ, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, ఎస్‌ఆర్డీపి, వాసవి స్కూల్, వైష్ణవి ఆర్కిటెక్చర్ కాలేజ్ విద్యార్థులు, పౌర సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా వేదకుమార్ మాట్లాడుతూ వారసత్వ సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, బాధ్యతగా భావించాలని సూచించారు.