calender_icon.png 4 February, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐకి కేరాఫ్ హైదరాబాద్

04-02-2025 12:43:11 AM

  1. ఏఐ యూనివర్సిటీతో రాష్ట్ర ప్రతిష్ఠను పెంచుతాం
  2. యువత నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి
  3. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాం తి): రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) అంటే హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా తెలంగాణను సాంకేతికంగా అభివృ ద్ధి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న డిపాజిటరీ ట్రస్ట్, క్లియరింగ్ కార్పొరేషన్ (డీటీసీసీ) నూతన కార్యాలయాన్ని సోమవారం హైటెక్ సిటీలో శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ యువతను ఏఐలో నిపుణులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం తో ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఏఐ వర్సిటీతో ప్రపంచస్థాయిలో తెలంగాణ ప్రతిష్ఠ పెరుగుతుందని వెల్లడించారు. ఎమర్జింగ్ టెక్నాల జీలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలను తమ సర్కారు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని చెప్పారు.

తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మించబోతోందని తెలిపారు. ఈ సిటీలో ప్రపంచస్థాయిలో నిపుణులను, కంపెనీలను భాగస్వామ్యలుగా చేస్తామని వివరించారు. సాంకేతికతలో రోజుకురోజుకూ కొత్త సవా ళ్లు ఎదురవుతున్నాయని, వాటి పరిష్కారానికి యువత నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రక్రియ లో యువతకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టంచేశారు. హైదరాబాద్ అంటే అందరికీ సాఫ్ట్‌వేర్ కంపెనీలే గుర్తుకొస్తాయని, కానీ ఇక్కడ అన్ని రంగాల పరిశ్రమల కార్యాలయాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. దాదాపు 100 నుంచి 120 కంపెనీలు హైదరాబాద్ నుంచే ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని గుర్తుచేశారు.

తెలంగా ణ అన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి అనువైన ప్రాంతమని చెప్పారు. పారి శ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టుకునేందుకు ముందుకువస్తే అండగా ఉంటా మని స్పష్టంచేశారు. డీటీసీసీ ఇండియాలో తమ రెండో కార్యాలయాలన్ని హైదరాబాద్‌లో ప్రారం భించడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు. దీని ద్వారా కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో మరో 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.