రాజేంద్రనగర్, జనవరి31: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి పుకెట్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులను జీఎంఆర్ సంస్థ శుక్రవారం ప్రారంభించింది. ప్రయాణికులకు అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచుతూ కొత్త విమాన సర్వీసులకు నాంది పలికింది. తొలి విమానం శుక్రవారం టేకాఫ్ అయింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బుధవారం, శుక్ర, ఆదివారాల్లో వారానికి మూడు స్వీసుల చొ సేవలను అందించనుంది.
ఫిబ్రవరి 15 నుంచి ఫ్రీక్వెన్సీ వారానికి ఆరు విమానాలకు పెరుగుతుందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. విమానం ప్రయాణ వ్యవధి సుమారు 3 గంటల 45 నిమిషాలు ఉం ఇది అంతరాయం లేని అనుభవాన్ని అందిస్తుందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.
అనంతరం జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ సీఈఓ ప్రదీప్ ఫణికర్ మా ఈ కొత్తరకం విమానాలను ప్రవేశపెట్టడంతో పుకెట్ హైదరాబాద్ మధ్య కనె పెంచుతుందన్నారు. పర్యాటకులకు పుకెట్ అత్యంత డిమాండ్ ఉన్న ప్రదేశం అన్నారు.
ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎండీ అలోక్‌సింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మధ్య నేరుగా విమానాలను ప్రారంభించిన తొలి ఎయిర్‌లైన్‌గా తాము ఉండటం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. కొత్త విమాన సర్వీసులు రెండు నగరాల మధ్య పర్యాటకం, వాణిజ్యాన్ని పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.