కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26(విజయక్రాంతి): ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం)హాజరులో హైదరాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరులో టాప్ 10లో నిలిచిన స్కూళ్ల హెచ్‌ఎంలతో మంగళవారం కలెక్టరేట్‌లో ‘కాఫీ విత్ కలెక్టర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఈవో ఆర్.రోహిణితో కలిసి కలెక్టర్ అనుదీప్ పాల్గొని హెచ్‌ఎంలతో మాట్లాడారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం ఇంకా పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ 21 హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఉందని స్పష్టం చేశారు. పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కలెక్టర్ హెచ్‌ఎంలకు సూచించారు.