calender_icon.png 16 October, 2024 | 8:54 PM

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు

16-10-2024 06:46:46 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, ఎవరైనా పార్టీ లైన్ లో పని చేయాల్సిందే అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశామని టీపీసీసీ అధ్యక్షులు తెలిపారు. పార్టీ చెప్పటిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తారంగా తీసుకెళ్లాలని సూచించారు. హామీల అమలులో కాంగ్రెస్ చరిత్ర సృష్టించిందని హార్షం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ ముంన్షి, కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథం, హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు,  మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సమీరుల్లా, పోటీ చేసిన అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్ లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.