28-08-2024 12:19:59 AM
హెచ్‌ఎండీఏ ప్రణాళికలు బాగున్నాయి
గుజరాత్ రాష్ట్రానికి చెందిన కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ పరేశ్‌శర్మ కితాబు
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 27 (విజయక్రాంతి): హైదరాబాద్ సిటీ అభివృద్ధికి చిరునామాగా మారిందని గుజరాత్ రాష్ట్రానికి చెందిన కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ పరేశ్‌శర్మ అన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికలు బాగున్నాయని కితాబునిచ్చారు. గుజరాత్‌లో అమలవుతున్న టౌన్‌ప్లానింగ్ విధానాలపై చర్చించేందుకు పరేశ్‌శర్మతో హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, రాజేందర్ నాయక్, చీఫ్ ఇంజనీర్ పరంజ్యోతి హైదరాబాద్‌లో మంగళవారం భేటీ అయ్యారు.
గుజరాత్‌లో లే ఔట్‌లు, అపార్ట్‌మెంట్‌లకు ఇచ్చే అనుమతులతో పాటు మాస్టర్‌ప్లాన్, జోనల్ విధానాలను, లే ఔట్ అనుమతులు, ల్యాండ్ పూలింగ్ వంటి అంశాలపై పరేశ్‌శర్మతో చర్చించారు. హెచ్‌ఎండీఏ 2050 లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న నేపథ్యంలో అధికారులకు పరేశ్‌శర్మ సూచనలు ఇచ్చారు. అనంతరం మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిషోర్‌ను హెచ్‌ఎండీఏ అధికా రులతో వెళ్లి పరేశ్‌శర్మ కలిశారు.