18-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): రామంతపూర్‌లోని గురువారం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో -ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ) బ్రాంచిని తెలంగాణ స్టేట్ కో -ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్, రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతమైన రామంతాపూర్‌లో ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు నూతన బ్రాంచీని ప్రారంభించామన్నారు.
హౌసింగ్ లోన్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీరేట్లు అందించనున్నట్లు తెలిపారు. అలాగే, లాకర్ సదుపాయాలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్లు బూరకుంట సతీష్, మోహన్‌రావు, బ్యాంక్ సీఈవో భాస్కర సుబ్రహ్మణ్యం, జీఎం ప్రభాకర్‌రెడ్డి, డీజీఎంలు సతీష్‌రెడ్డి, నాగంజలి పాల్గొన్నారు.