calender_icon.png 28 September, 2024 | 4:49 AM

హైదరాబాద్-అయోధ్య విమానం

28-09-2024 02:50:00 AM

  1. కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, ఆగ్రాకు కూడా విమానాలు 
  2. ఒక్క నెలలోనే 7 నగరాలకు కొత్త విమాన సర్వీసులు షురూ 
  3. హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): నూతన విమాన సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విమానయాన సంస్థలు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగా ఇండిగో విమానయాన సంస్థ ఒక్క సెప్టెంబర్ నెలలోనే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 7 కొత్త మార్గాల్లో సర్వీసులను ప్రారంభించడానికి ముందుకొచ్చింది.

ఇందులో భాగంగానే శుక్రవారం హైదరాబాద్ - కాన్పూర్ విమాన సర్వీస్‌ను ప్రారంభించింది. నేటి నుంచి హైదరాబాద్ నుంచి అయోధ్యకు వారానికి 4 రోజులు,- ప్రయాగ్‌రాజ్ వారానికి 3 రోజులు, ఆగ్రాకు వారానికి 3 రోజుల పాటు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటికే ఈ నెల 16న రాజ్ కోట్‌కు డైలీ సర్వీసును , 23న అగర్తలకు వారానికి 4 రోజులు, 24న జమ్మూకు వారానికి 3 రోజుల సర్వీసును ఇండిగో ప్రారంభించింది. ఒక్క నెలలోనే హైదరాబాద్ నుంచి 7 నగరాలకు నేరుగా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రయాణాల్లో అదే రోజు ఆయా నగరాల నుంచి తిరిగి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు నడుపుతున్నారు. అయోధ్యకు వెళ్లే భక్తులకు, జమ్మూ వెళ్లే పర్యాటకులకు కొత్త విమానాలు ఎంతో ఉపయుక్తం కానున్నాయి.

హైదరాబాద్ నుంచి సెప్టెంబర్‌లో ప్రారంభమైన సర్వీసులు

విమాన సర్వీసు వారంలో ఎన్ని రోజులు ప్రారంభించిన తేదీ

హైదరాబాద్-రాజ్‌కోట్ ప్రతిరోజు సెప్టెంబర్ 16

హైదరాబాద్-అగర్తల (సోమ, బుధ, శుక్ర, ఆది) సెప్టెంబర్ 23

హైదరాబాద్-జమ్మూ (మంగళ, గురు, శని) సెప్టెంబర్ 24

హైదరాబాద్-కాన్పూర్ (సోమ, బుధ, శుక్ర, ఆది) సెప్టెంబర్ 27

హైదరాబాద్-అయోధ్య (సోమ, బుధ, శుక్ర, ఆది) సెప్టెంబర్ 27

హైదరాబాద్-ప్రయాగ్‌రాజ్ (మంగళ, గురు, శని) సెప్టెంబర్ 28

హైదరాబాద్-ఆగ్రా (మంగళ, గురు, శని) సెప్టెంబర్ 28