calender_icon.png 31 October, 2024 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ వేదికగా

31-10-2024 12:36:11 AM

భారత్, మలేషియా ఫ్రెండ్లీ మ్యాచ్

న్యూఢిల్లీ: భారత్, మలేషియా మధ్య జరగనున్న అంతర్జాతీయ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేది క కానుంది. ఈ మ్యాచ్ నవంబర్ 18న జరగనున్నట్లు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది నవంబర్ 11 నుంచి 19 మధ్య  సీజన్ చివరి ఫిఫా విండో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇటీవలే గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇంటర్ కాంటినెంటల్ టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ లో మారిషస్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత్.. 0-3తో సిరియా చేతిలో ఓటమి చవిచూసింది.