25-03-2025 12:50:57 AM
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): తెలంగాణలో మరో ఎన్నిక నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మే 1తో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు పదవీ కాలం ముగియనుంది. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఫలితాలు లెక్కింపు ఉంటుదని ఈసీ పేర్కొంది. హైదరాబాద్ జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్టు ఈసీ వెల్లడించింది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కబోతున్నదని ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలకు గానూ మూడు కాంగ్రెస్, ఒక స్థానంలో సీపీఐ, మరో స్థానంలో బీఆర్‌ఎస్ విజయం సాధించాయి.
అయితే ఆ సమయంలో తమకు ఒక సీటు కేటాయించాలని ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌ను కోరింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చినట్టు వార్తలు విపించాయి.