calender_icon.png 12 February, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైబ్రిడ్ యన్యూటి మోడల్ ప్రోగ్రాంకు

12-02-2025 01:33:12 AM

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, ఫిబ్రవరి 11 ( విజయక్రాంతి ) : హైబ్రిడ్ యన్యూటి మోడల్ ప్రోగ్రాం (HAM) కింద జిల్లా కేంద్రం నుంచి హైవే రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి రోడ్డు అభివృద్ధి కి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ రాష్ర్ట ప్రభుత్వం రాష్ర్టంలో రోడ్లు లేని గ్రామాలకు బి.టి రోడ్లు వేయించడం, ఉన్న రోడ్లను మరింత అభివృద్ధి పరచేందుకు హైబ్రిడ్ యాన్యూటి మోడల్ ప్రోగ్రాం రూపొందించడం జరిగిందన్నారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రంజిత్ గంగ్వార్, రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు దేశ్య నాయక్, పంచాయతీరాజ్ శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు మల్లయ్య,  డీ. ఈ లు సీతారామ స్వామి, తదితరులు పాల్గొన్నారు.