హుజూర్ నగర్,(విజయక్రాంతి): హుజూర్ నగర్ కు చెందిన రాజు సంజయ్ విజయనగరంలో నిర్వహించిన మిస్టర్ ఆంధ్ర ప్రదేశ్ బాడీ బిల్డింగ్ విభాగం నందు గోల్డ్ మెడల్ సాధించాడు. రాజు సంజయ్ ని హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి చరమందరాజు, కౌన్సిలర్ కష్టాల శ్రవణ్ కుమార్, మంజు నాయకులు సన్మానించారు. సీఐ జి చరమందరాజు మాట్లాడుతూ... యువత ఆదర్శంగా తీసుకొని వ్యాయామం చేయాలని, తగిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పోటీ పరీక్షలలో రాణించాలని సూచించారు. 15 సంవత్సరాల క్రితం తమిళనాడులోని మదురై జిల్లా మదిప్పనూరు నుండి హుజూర్నగర్ కు వచ్చి సీతారాం నగర్ కాలనీలో స్థిరపడిన రాజు కుమార్ , రాజు జయ అను వారు స్వీట్ వస్తువుల వ్యాపారం చేసుకుంటూ తన కొడుకును డిగ్రీ చదివిస్తూ వ్యాయామం జిమ్ నేర్పించి అతడిని ప్రయోజకుడిని చేయాలనే పట్టుదలతో తన కొడుకు కు వ్యాయామం నేర్పించి నారు. కొడుకు బాడీ బిల్డింగ్ లో మంచి పథకాలు తేవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో బాడీ బిల్డర్ సంజయ్ గురువు షేక్ మస్తాన్ ,జిమ్ ట్రైనర్ నెమ్మా ది రవి . హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఉదారి శ్రీను .శ్రీధర్. అజయ్ ,అంజి ,జగన్, రాంబాబు ,రాజు సునీల్ యాకోబ్ ,విజయ్ ,రఘు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.