calender_icon.png 13 March, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజురాబాద్ ప్రెస్ క్లబ్

12-03-2025 08:51:10 PM

అధ్యక్ష, కార్యదర్శులుగా కాయిత రాములు, కామని రవీందర్

హుజురాబాద్,విజయక్రాంతి: టీయుడబ్ల్యూజే(ఐజేయు) కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం హుజురాబాద్ లోని మధువని గార్డెన్లో ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులకు ఎన్నికలు కాగా ఎన్నికల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కాయిత రాములు గెలుపొందగా, ప్రధాన కార్యదర్శిగా కామని రవీందర్ గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా ముష్క శ్రీనివాస్, పిల్లల సతీష్ కుమార్, మాడ రవీందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిలుగా కుడిక్యాల సాయిలు, మచ్చిక చందు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గోస్కుల రాజ్ కుమార్, కోశాధికారిగా కేశబోయిన స్వామి, కార్యవర్గ సభ్యులుగా హర్షిల్ అజీమ్, నాగవల్లి రాజు, మంతెన కిరణ్ కుమార్, భరత రజినీకాంత్, అబ్దుల్ ఫహీం, బత్తుల రాజలింగం, పోతురాజు సంపత్, చిర్ర సుదర్శన్, తాటిపాముల దేవేందర్, మర్రి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కాయిత రాములు, కామని రవీందర్ లు  మాట్లాడుతూ.. తమకు ఓటు వేసి గెలిపించిన తోటి పాత్రికేయ మిత్రులకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జర్నలిస్టుల సమస్యలతో పాటు ప్రధాన సమస్య అయిన జర్నలిస్టుల నివేషశ న స్థలాలపై ఎలాంటి పోరాటాల కైనా సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్,  కొయ్యడ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్,స్టేట్ హెల్త్ కమిటీ మెంబెర్ మహీంద్రాచారి తోపాటు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.