హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు మరికొందరికి హుజూరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళితబంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలని నవంబర్ 9వ తేదీన బీఆర్ఎస్ ధర్మా, రాస్తారోకో నిర్వహించింది. అనుమతి లేకుండా హైవేపై ధర్మా, రాస్తారోకో చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు బీఎన్ఎస్ 35(3) కింద హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు.