28-03-2025 06:23:03 PM
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్
ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని సన్మానించిన ప్రణవ్
హుజురాబాద్,(విజయక్రాంతి): హుజరాబాద్ జర్నలిస్టుల ప్రధాన సమస్య ఇళ్ల స్థలాల విషయంలో తాను గతంలో ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నానని, మొదటి ప్రాధాన్యతగా తీసుకొని జర్నలిస్టుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామంలో శుక్రవారం ప్రణవ్ నివాసంలో జర్నలిస్టులు కలిశారు. హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఆయన శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కాయిత రాములు కామని రవీందర్ లు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయినా ఇళ్ల స్థలాల విషయం గురించి మరోసారి ప్రణవ్ కు వివరించారు.
తమ ఇళ్ల స్థలాల పై కేసు వేసిన కాంగ్రెస్ నాయకున్నీ వెంటనే కేసు ఉపసంహరించుకునేలా చేయాలని వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి మీటర్లు ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల ముందు జర్నలిస్టుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని, చెప్పిన విధంగానే సమస్యను త్వరలో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. విద్యుత్ మీటర్ల కేటాయింపు కోసం హుజురాబాద్ ట్రాన్స్కో డిఈ తో ఆయన మాట్లాడారు. విద్యుత్ మీటర్లు బిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నంబి భరణి కుమార్, చిలుక మారి సత్యరాజ్, వేల్పుల సునీల్, రవీందర్ రెడ్డి, మాచర్ల రాజు, సమ్మెట సతీష్ తో పాటుతదితరులు పాల్గొన్నారు.