హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. హుస్సేన్ సాగర్ మాగ్జిమం ఎఫ్‌టీఎల్ 514.75 మీటర్లు ఉండగా, మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి 513.30 మీటర్లకు చేరుకున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.