calender_icon.png 31 October, 2024 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుస్నాబాద్‌ను రోల్‌మోడల్ చేస్తా

06-07-2024 12:00:00 AM

  1. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పూర్తికి కృషి
  2. గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు 
  3. సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్

హుస్నాబాద్, జూలై 5: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. గురువారం నియోజకవర్గ అభివృద్ధిపై సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లా కలెక్టర్లు మిక్కిలినేని మనుచౌదరి, పమేలా సత్పతి, ప్రావీణ్యతో పాటు జిల్లా కలెక్లర్లు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్య, వైద్యం, వ్యవసాయాధారిత రంగాలకు అధి క ప్రాధాన్యతమిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ సేవలు అందేలా కృషిచేస్తానని తెలిపా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే చేనేత, వ్యవసాయాధారిత రంగా లతో పాటు వివిధ పథకాలను రైతులు, పేద వర్గాలకు అందేలా చొరవ చూపాలని అధికారులకు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని, తాగునీటి వ్యవస్థ, ఇరిగేషన్ ప్రాజెక్టు స్థితిగతులపై అధికారులు రూట్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు. నియోజనవర్గంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామాని పేర్కొన్నారు.

గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమల కల్పనకు కృషిచేస్తానని మంత్రి చెప్పారు. ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారు లకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయా లు, విద్యాసంస్థలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలను అందించేందుకు కృషిచేస్తానన్నారు. ఎస్సారెస్సీ మిడ్‌మానేరు ద్వారా రైతులకు సాగునీరు అందేలా కృషిచేస్తామని తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతం టూరిజం స్పాట్‌కు అను కూలంగా ఉంటుందని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్న స్పష్టం.

ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ ఆలయం, శనిగరం ప్రాజెక్టు, మహాసముద్రం, రాయికల్ జలప్రాంతం సర్వాయిపేట, పీవీ నరసింహారావు స్వగ్రామం వంగర, కొత్తకొండ వీరభద్రస్వా మి దేవాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతులు, నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి చేపలు, గొర్లు, మేకలు పెంపకంతో పాటు డైరీ ఫామ్స్ ఏర్పాటుకు అధికారులు తగిత చర్యలు తీసుకోవాలని సూచించారు. హు స్నాబాద్ నుంచి చేపలు, మేకలు, గొర్లు హైదరాబాద్‌కు ఎగుమతి చేసేలా ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.

స్వశక్తి సంఘాల బలోపేతానికి కృషిచేస్తామని, ఇం దిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. విదే శీ విద్యా విధానంలో భాగంగా యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎప్పటికప్పుడు శక్తివంచనలేకుండా కృషిచేయాలని కోరారు. సమా వేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, ప్రపుల్ దేశాయ్, రాధిక గుప్తా, శ్రీని వాస్‌రెడ్డి, లక్ష్మి, కిరణ్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.