calender_icon.png 14 November, 2024 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుల మోజుల పడి భర్తల హతం

12-11-2024 01:36:17 AM

వెల్దండ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలుపుతున్న ఎంజీ తండా వాసులు

  1. మరిదితో వదిన వివాహేతర సంబంధం 
  2. అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
  3. రాళ్ల చెరువు తండాలో ఘటన 
  4. ఎంజీ తండాలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
  5. యువ రైతు హత్య కేసులో నిందితురాలి అరెస్టు

నాగర్‌కర్నూల్, నవంబర్ 11 (విజయక్రాంతి): ప్రియుల మోజులో కట్టుకున్న భర్తలనే చంపిన ఘటనలు నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగాయి. తిమ్మాజిపేట మండలం రాళ్ల చెరువు తండాలో మరిదిపై మోజుతో కట్టుకున్న భర్తను మరిది, అత్తతో కలిసి శనివారం హతమార్చింది. ఈ ఘటన సోమ వారం వెలుగులోకి వచ్చింది. రాళ్ల చెరువు తండాకు చెందిన సభావత్ శ్రీను(40)కు అదే గ్రామానికి చెందిన శాంతితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.

శ్రీను రోజు తాగి వచ్చి తల్లి జాంబ్రి, భార్య శాంతిలను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే శ్రీను తమ్ముడు సభవాత్ గోపాల్‌తో శాంతి వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకు న్న శాంతి.. మరిది గోపాల్, అత్త జాంబ్రితో కలిసి శనివారం రాత్రి శ్రీను ఇంట్లో నిద్రిస్తుండగా తలపై కర్రతో మోది తాడుతో ఉరివేసి హతమార్చారు.

నింద వారిపైన పడకుండా అదే గ్రామంలోని శాంతి తల్లిదం డ్రులే చంపారని నమ్మించేందుకు మృతదేహాన్ని తల్లి గారి ఇంటి వద్ద ఉంచేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విష యం పూర్తిగా బయటపడింది. సోమవారం ఎస్సై నరేందర్‌రెడ్డి తండాకు వెళ్లి కేసు నమో దు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

ఎంజీ తండా హత్యోదంతంలో అసలు కోణం..

ఈ నెల 8న నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మం డలం ఎంజీకాలనీ తండాకు చెందిన రాత్లావత్ రాజు (30) తన భార్య హి మబిందుతో కలిసి వేరుశనగ పంట కాపలా కోసం రాత్రి వెళ్లాడు. కానీ అర్ధరాత్రి మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లి హత్యకు గురైనట్టు భార్య బంధువులకు తెలిపింది. పోలీసులు అనుమానంతో హిమబిందును విచారించగా అసలు విషయం తెలిసింది.

ఇతర గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో హిమబిందుకు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు, మరో ఇద్దరు కలిసి రాజును హత్య చేసినట్టు తెలిసింది. వారిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకోగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బంధువులు, గ్రామస్థులు వెల్దండ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.