calender_icon.png 27 April, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యను హత్య చేసి పరారైన భర్త శవమై కనిపించాడు..

26-04-2025 07:03:10 PM

అనుమానాస్పద స్థితిలో మారుతి మృతదేహం లభ్యం..

గుడిహత్నూర్ (విజయక్రాంతి): భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి పరారీలో ఉన్న భర్త చివరకు శవమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఈనెల 23న మారుతి అనే వ్యక్తి తన భార్య కీర్తిని కత్తితో గొంతు కోసి అత్యంత కిరాతంగా హత్య చేసి పరారైన ఘటన తెలిసింది. ఐతే గత నాలుగు రోజులుగా పరారీలో ఉన్న మారుతి శనివారం గ్రామ శివారులో అనుమానస్పద రీతిలో శవమై కనిపించాడు.

శనివారం ఉదయం జై భీం నగర్ కు చెందిన ఓ మహిళ బహిర్భూమికి వెళ్ళగా అక్కడ శవం కనిపించడంతో మహిళల భయంతో కేకలు వెయగా చుట్టుపక్కల వారు రాగ శవాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దింతో ఇచ్చోడ సీఐ భీమేష్, గుడిహత్నూర్ ఎస్సై మహేందర్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుళ్లిపోయి స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించారు. మృతుడు మారుతి తన భార్యను చంపిన రోజే తను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడా... లేదా ఎవరైన కొట్టి చంపరా అనేది తెలియాల్సి ఉంది.