calender_icon.png 9 October, 2024 | 11:52 PM

నా భార్య రోజూ లక్షలు తెస్తోంది!

09-10-2024 09:15:09 PM

భారీగా కరెప్షన్ చేస్తోంది

వాళ్ళ సోదరులకు కోట్లలో అప్పు ఇచ్చింది

ఇంట్లో అన్ని నోట్ల కట్టలే

మణికొండ డిఈఈ దివ్య జ్యోతి భర్త శ్రీపాద సంచలన ఆరోపణలు

నోట్ల కట్టలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్

మణికొండ కాంగ్రెస్ ముఖ్య నేతతో 'సన్నిహితం'

ఆయన అండతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆరోపణలు

 రాజేంద్రనగర్ (విజయ క్రాంతి): 'నా భార్య భారీగా అవినీతికి పాల్పడుతుంది.. రోజు నోట్ల కట్టలు లేనిదే ఇంటికి రాదు' అని మణికొండ డిఈ దివ్య జ్యోతి భర్త శ్రీపాద సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తమ ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం కలకలం రేపుతుంది. 

ఇటీవల జిహెచ్ఎంసికి బదిలీ..

సుమారు రెండు సంవత్సరాల పాటు మణికొండ మున్సిపాలిటీలో దివ్య జ్యోతి డిఈఈగా పనిచేసింది. ఈ నేపథ్యంలో ఆమె భారీగా అవకతవకలకు, అవినీతికి పాల్పడిందని మున్సిపాలిటీ సిబ్బందితో పాటు స్థానిక నాయకులు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ప్రతినిత్యం ఆమె కాంట్రాక్టర్లను గుల కోసం వేధిస్తూ ప్రతిరోజు లక్షల రూపాయలు తన ఇంటికి తెస్తుందని ఆమె భర్త శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి డబ్బు వద్దని కొన్ని రోజులుగా తాను చెబుతున్న వినకుండా అదే తీరు కొనసాగించడంతో ఆయన ఆగ్రహానికి తన ఇంట్లో ఆర్య దివ్య జ్యోతి ఎక్కడెక్కడ నోట్ల కట్టలు దాచిపెట్టిందో వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

ఓ ముఖ్య నేతతో చెట్టాపట్టాల్ 

ఇదిలా ఉండగా డిఈఈ దివ్య జ్యోతి మనికొండ మున్సిపాలిటీలోని అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతతో కొన్ని రోజులుగా చనువుగా ఉంటుందని స్థానిక నాయకులు చెబుతున్నారు. వారు ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారని, డిఈఈ ఆయనతో సన్నిహితంగా మెలుగుతూ చక్రం తిప్పిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా రెండు సంవత్సరాలు మణికొండ మున్సిపాలిటీలో భారీగా అవినీతికి పాల్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మా ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే ఉన్నాయని డిఈఈ భర్త చెప్పడం గమనార్హం.

తమ్ముడికి కోట్ల మేర అప్పులు..

దివ్య జ్యోతి తన భర్తకు అవినీతి సొమ్మును రూ1.1 కోట్లు అప్పుగా ఇచ్చిందని ఆమె అవినీతికి అంతే లేదని భర్త శ్రీపాద ఆరోపించాడు. శ్రీపాద పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ కావడంతో మణికొండ మున్సిపాలిటీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందోనని నాయకులు చర్చించుకుంటున్నారు.