calender_icon.png 26 April, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య గొంతుకోసి హత్యచేసిన భర్త

25-04-2025 12:00:00 AM

వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిందని అఘాయిత్యం

గుడిహత్నూర్, ఏప్రిల్ 24: ఓ మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధాన్ని తన భార్య పసికట్టి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి తన పరువు తీసిందనే కోపంతో భర్త.. ఆమె గొంతుకోసి హత్యచేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ సీఐ భీమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండల కేంద్రంలోని లట్పటే మారుతికి 13 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన కీర్తితో వివాహం జరిగింది. మారుతి గత ఐదు సంవత్సరాల క్రితం స్థానికంగా ఒక డెయిరీ ఫామ్ నిర్వహించగా, దాని నిర్వహణకు రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ క్రమంలోనే ఓ వివాహితతో వివాహేతర సంబం ధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్య కీర్తికి తెలి సి భర్తను నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి.

కీర్తి తన పుట్టింటికి వెళ్లగా, కొన్ని రోజు ల క్రితం పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఒకవైపు అప్పులు, మరోపక్క వివాహేతర సంబంధాన్ని భార్య పెద్ద మనుషులు సమక్షంలో పంచాయితీ పెట్టి తన పరువు తీసిందని భార్యపై కోపం పెంచుకున్నాడు. తన భార్యను అడ్డు తొలగించుకుంటే వేరే మహిళతో ఉండవచ్చునే ఉద్దేశంతో భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కాగా కీర్తి గత కొన్ని రోజుల నుంచి పుట్టింట్లోనే ఉంటుంది.

గురువారం ఉద యం కీర్తి తల్లిదండ్రులు పని నిమిత్తం బయటికి వెళ్లడంతో ఇంటి పక్కన ఉన్న కుళాయి వద్దకు మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్లిన కీర్తిని మారు తి వెనుక నుంచి వెళ్లి కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆమె అపరస్మారక స్థితిలో కింద పడిపొయింది. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి తండ్రి సూర్యకాంత్ ముండే ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని సీఐ భీమేష్ పేర్కొన్నారు.

భార్యను కడతేర్చిన భర్త

కాగజ్‌నగర్, ఏప్రిల్ 24: కుటుంబ కలహాలతో భార్యను భర్త హత్య చేసిన ఘటన కాగజ్‌నగర్ మండలం వంజిరి గ్రామంలో జరిగింది. వంజిరి గ్రామంలో నివాసం ఉంటున్న డోకే జయరాంకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు కుమార్తె ఉండగా వివాహం చేశారు. చిన్న భార్య పోచక్కకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జయరాం, పోచక్కకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. గత వారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సముదాయించారు. బుధవారం రాత్రి పోచక్క, జయరాం మళ్లీ గొడవపడటంతో కోపోద్రిక్తుడైన జయరాం.. పలుగుతో ఆమె తలపై బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోచక్క అక్కడిక్కడే మృతి చెందింది. ఇన్‌చార్జి సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లి రాజుబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.