- వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే..
పోలీసుల అదుపులో వివాహిత, ఆమె ప్రియుడు
కామారెడ్డి, జనవరి 24 (విజయక్రాంతి): వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన వి ఆమె ప్రియుడ్ని పోలీసులు అరె చేశారు. 40 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలం నెమ్లి గ్రా జరిగిన హత్య కేసును పోలీసులు ఛే నిందితులను శుక్రవారం అరెస్టు చే కామారెడ్డి జిల్లా నెమ్లి గ్రామానికి చెందిన టెకుర్ల మైసయ్య(40), రాధ దంపతులు. 40 రోజుల క్రితం మైసయ్య అదృశ్య అతని భార్య ఈ నెల 21న నస్రూల్లాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎస్సై లావణ్య కేసు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. భర్త 40 రోజుల క్రితం అదృశ్యమైయితే ఈ నెల 21న ఫిర్యాదు చేయడంతో అనుమానం వచ్చి రాధను విచారించారు. దీం ఆమె జరిగిన విషయం పోలీసులకు చెప్పింది. నెమ్లి గ్రా చెందిన నాగరాజుతో రాధ వివాహేతర సం కొనసాగిస్తున్నది. ఈ విషయంలో పలుసార్లు భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి.
దీంతో మైసయ్య అడ్డు తొలగిం పథకం ప్రకారం రాధ ఆమె ప్రియుడు నాగరాజుతో కలిసి ఉరివేసి హత్య చేశారు. మృతదేహాన్ని గోనే సంచిలో పెట్టి సోమలింగేశ్వరాలయ సమీపంలో ఓ గుట్ట ప్రాంతంలో పడేసినట్లు తెలిపింది. 40 రో అనంతరం తన భర్త కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకం ఆడింది. పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేశారు. మృతుడి తల్లి లచ్చవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.