calender_icon.png 12 February, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండరాయితో భార్యను హతమార్చిన భర్త

12-02-2025 12:00:00 AM

కూకట్ పల్లి ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): భార్యపై అనుమానంతో బండరా యితో తలపై మోది హత్య చేసిన సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... రాజీవ్ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న నాశ్రిమా బేగం (35) భర్త రహీం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

హబీబ్ నగర్ లో ఉంటున్న దంపతులు అక్కడ ఇల్లు కాలి చేసి మంగళ వారం రాజీవ్ గాంధీ నగర్ లో అద్దెకు తీసుకొని ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తున్న నశ్రిమా బేగం తలపై బండాయితో మోది హత్య చేశాడు. సమాచారం అందుకున్న కుక్కట్ పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతురాలి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.