మంథని, డిసెంబర్ 31( విజయక్రాంతి): కట్టుకున్న భార్యను కడ తేర్చిన విషాద ఘట న మంథని మండలంలోని గోపాలపూర్ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివ రాల ప్రకారం మంథని మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన బొల్లి ఓదెలు (35) ముత్తారం మండలంలోని జిల్లెల్ల పల్లె గ్రామానికి చెందిన గడ్డం రాజేశం కూతురు సంధ్యను గత 8 ఏండ్ల క్రితం వివా హం చేసుకున్నాడు.
వారికి ఇద్దరు కుమా రులు ఉన్నారు. జీవనోపాధి కోసం ఓదెలు పక్క గ్రామమైన మంథని మండలం గోపాల పూర్ శివారులో చికెన్ సెంటర్ ఏర్పాటు చేసుకొని ఒక ఇంట్లో అద్దె కుంటూ జీవిస్తు న్నారు.
మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో గొడవలు జరగగా ఆవేశంతో ఓదెలు భార్య ను గొంతు నులిమి హత్య చేశాడని కుటుం బ సభ్యులు గ్రామస్తులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న మంథని సిఐ రాజు, ఎస్‌ఐ రమేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.