మేడిపల్లి: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలో దారుణం చోటుచేసుకుంది. బార్య పై అనుమానంతో భర్త వ్యవసాయానికి ఉపయోగించే పరికరంతో కొట్టి చంపి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తొంబర్రావుపేట గ్రామానికి చెందిన రాయంచి జల అనే మహిళను అమె భర్త రాయంచి లింగం హత్యచేశాడు. ఆదివారం సాయంత్రం సమయంలో గల్ఫ్ దేశమైన బేరాన్ నుండి వచ్చిన లింగం, అమెపై అనుమానం పెంచుకున్నాడు.
రాత్రి సమయంలో బార్య జలతో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరిమద్య కాసేపు గొడవ జరిగింది. సోమవారం తెల్లారుజామున మొదటగా అమెకు ఉరివేసి ఆ తర్వాత వ్యవసాయ పనులకోసం ఉపయోగించే పౌడ పరికరంతో జల తలపై బాదాడు. దీంతో తీవ్రరక్తస్రావంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం లింగం పురుగులమందుతాగి అత్మహత్యయత్నానికి పాల్పడటంతో అతన్ని జగిత్యాల అసుపత్రికి తరలించారు. లింగం తన భార్యపై అనుమానం పెంచుకొని గల్ఫ్ దేశం నుండి ఆదివారం వచ్చినట్టు రాత్రి సమయంలో అమెను మొదటగా ఉరివేసి ఆ తర్వాత ఇనుప వస్తువుతో హత్య చేసినట్టు కోరుట్ల సిఐ తెలిపారు. సంఘటన స్థలంలో అమె హత్యకు ఉపయోగించిన పరికరాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా మృతురాలికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఇప్పటికే కూతురు వివాహం జరగగా కొడుకు గల్ఫ్ దేశంలో ఉంటున్నాడు.