calender_icon.png 22 December, 2024 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియుడి మోజులో భర్త హత్య

03-08-2024 03:22:19 AM

ప్రియుడితో పాటు నిందితురాలి అరెస్టు

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగష్టు 2(విజయక్రాంతి): ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త మృతికి కారణమైన భార్య, ప్రియుడు కటకటల పాలయ్యారు. శుక్రవారం సీఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. దహెగాం మండల కేంద్రానికి చెందిన మల్లేశ్‌తో ఎల్లూర్ గ్రామానికి చెం దిన మంజుల(సుజాతకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఎల్లూరుకు చెందిన రాజుతో సుజాత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో సంవత్సరం నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో కొంత కాలంపాటు దూరంగా ఉన్నారు. నాలుగు నెలల క్రితం సుజాత తల్లిదండ్రులు దంపతులిద్దరినీ మళ్లీ కలిపారు.

అయినా సుజాత తీరులో మార్పు రాలేదు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న సుజాత.. ప్రియుడు రాజుతో కలిసి గత నెల 25న తన మల్లేశ్ గొంతు పిసికింది. కొన ఊపిరితో ఉన్న మల్లేశ్‌ను కుటుంబ సభ్యులు  కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్య అందించి ఇంటికి తీసుకువ చ్చారు. ఈ నెల 28న పరిస్థితి విషమించడంతో మల్లేశ్ మృతి చెందాడు. మల్లేశ్ మృతి కి కారణమైన అయిన సుజాత, రాజును శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.