calender_icon.png 22 September, 2024 | 1:29 AM

భర్తే కాలయముడు

15-07-2024 02:02:27 AM

  1. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించి.. పోలీసులకు చిక్కి.. 

భార్య, ఇద్దరు పిల్లల మృతి కేసును ఛేదించిన పోలీసులు

ఖమ్మం,జూలై14(విజయక్రాంతి):ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మే 17న అనుమానాదాస్పద స్థితిలో వివాహిత, ఇద్దరు పిల్లలు మృతిచెందిన ఘటన వెలుగుచూసింది. కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టగా, తాను తాను స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడినట్లు భర్త పోలీసులకు వెల్లడించాడు. ఈ కేసును రఘునాథపాలెం పోలీసులు సీరియస్‌గా తీసుకు ని విచారణ ప్రారంభించారు. భార్యను భర్తే నిందితుడు అని తేల్చారు. భార్యకు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి, ఇద్దరు పిల్లలను ఊపిరాడకుండా చేసి హతమార్చినట్లు నిర్ధారించారు. ఖమ్మం నగరంలోని ఏసీపీ కార్యాలయంలో ఆదివారం ఏసీపీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. 

రఘునాథపాలెం మండలం బాబోజీతండాకు చెందిన బోడాప్రవీణ్‌కు ఇదే మండలా నికి చెందిన కుమారి(25)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు కృషిక (4), తనిష్క (3). ప్రవీణ్ హైదారాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో ఫిజియో థెరపిస్టుగా పనిచేస్తున్నాడు. ప్రవీణ్ కొంతకాలం నుంచి ఇదే దవాఖానలో నర్సుగా పనిచేస్తున్న యువతితో వివాహేతర సంబం ధం నెరపుతున్నాడు. ఈ విషయం బయటపటడంతో భార్య కుమారి నిలదీసింది. వివాహేతర సంబంధానికి భార్య అడ్డుగా ఉందని భావించిన ప్రవీణ్ ఆమెతో పాటు పిల్లలను మట్టుపెట్టాలని పథకం రచించాడు.

పథకం లో భాగంగా మే 17న హైదరాబాద్ నుంచి వారిని కారులో ఎక్కించుకుని స్వగ్రామానికి వచ్చాడు. మర్నాడు షాపింప్ పేరుతో భార్య, ఇద్దరు పిల్లలను కారులో ఖమ్మం తీసుకెళ్లా డు. షాపింగ్ తర్వాత సాయంత్రం 4 గంటలకు కారులో వెనుదిరిగాడు. ఈ లోపు భార్య నీరసంగా ఉందని చెప్పడంతో ఆమెకు ప్రవీణ్ అప్పటికే తన వెంట తెచ్చుకున్న మత్తు ఇంజెక్షన్‌ను అధిక మోతాదులో ఇచ్చాడు. డోసు ఎక్కువై కొద్దిసేపటి తర్వాత భార్య మృతిచెందింది. ప్రవీణ్ తర్వాత పిల్లల నోట్లో రుమాళ్లు కుక్కి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. కారును మంచుకొండ దాటాగా రోడ్డు పక్కన పొదల్లోకి వెళ్లన్నిచ్చి చెట్టుని ఢీకొట్టాడు. ఘటనలో ప్రవీణ్‌కు స్వల్పగాయాలయ్యాయి. అప్పటికే కారులో విగతజీవులుగా చిన్నారులు ఉండగా, భార్య కొన ఊపిరితో ఉన్నది. ఆమెను స్థానికులు ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మృతిచెందింది. 

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘునాథపాలెం సీఐ శ్రీహరి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రెండు బృందాలు రంగంలోకి దిగి విచారణ ను వేగవంతం చేశారు. ఘటన సంభవించిన కారులో దొరికిన సిరంజి, మృతు ల శవపరీక్షల ఆధారంగా ప్రవీణే దారుణానికి ఒడిగట్టాడని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మొబైల్‌లో సైతం కీలక ఆధారాలను సేకరించి, అతడిపై హత్యకేసు నమోదు చేశారు.