జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భార్యను భర్త కీరాతకంగా కత్తితో మెడపై నరికి హత్య చేసిన సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం అవుసుల తాండాలో చోటుచేసుకుంది. నిజాం సాగర్ ఎస్హెచ్ఓ సుధాకర్ కథనం ప్రకారం... అవుసుల తాండాలో భర్త షేర్య, మేగావత్ మోతి బాయి(55) మెడపై కత్తితో నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.