calender_icon.png 23 February, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

21-02-2025 12:00:00 AM

నారాయణఖేడ్, ఫిబ్రవరి 20: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో భార్య గొడ్డలితో నరికి చంపిన సంఘటన గురువారం వె కువ జా మున  చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండల పరిధి లోని తుర్క వడగం గ్రామానికి చెందిన హెబల్లె గుండప్ప తన భార్య అయిన చంద్ర మను ఇంట్లోనే గొడ్డలితో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు.

చుట్టు ప్రక్కల వారు గుండప్పను దేహశుద్ధి అనంతరం విషయం పోలీసులకు తెలిపి ఉంచుచున్ని అప్పజెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్త్స్ర విజయ్ కుమార్ సంఘటనపై వివరాలను సేకరించారు. హత్య కు పాల్పడ్డ భర్తను అరెస్టు చేసి కంగ్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాగిన మైకంలోనే భార్యను గొడ్డలితో చంపాడని తెలిపారు.

మృతురాలికి ఇద్దరు కుమారులు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.